: తొలి రౌండ్ నుంచే దూసుకుపోతున్న జయలలిత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సభ్యత్వం నిమిత్తం పోటీ చేసిన ఆర్ కే నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 28 మంది పోటీలో నిలబడగా, జయలలిత తొలి రౌండులోనే స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి, ఫలితం ఎలా ఉండబోతుందో చెప్పేశారు. తొలి రౌండులో ఆమె 8,632 ఓట్ల ఆధిక్యాన్ని పొందారు. ఆమె సమీప అభ్యర్థులెవరికీ నాలుగంకెల ఓట్లు రాలేదని తెలుస్తోంది. 25 మంది అభ్యర్థులకు పడ్డ ఓట్లు 100కు లోపేనని సమాచారం. ఈ మధ్యాహ్నానికి పూర్తి ఫలితం వెలువడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.