: చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింటుమెంట్... నేటి మధ్యాహ్నం భేటీ
ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలవనున్నారు. ఈ మేరకు వర్షాకాల విడిది నిమిత్తం నిన్న హైదరాబాదుకు వచ్చిన ప్రణబ్ అపాయింటుమెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు చంద్రబాబు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు. ఓటుకు నోటు నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఈ భేటీలో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.