: ఇకపై అర్ధరాత్రి వరకూ శ్రీవారి ఈ-దర్శన్ బుకింగ్!


తిరుమల వెళ్లి ఇబ్బందులు పడకుండా శ్రీవారిని సులువుగా దర్శించి రావాలని భావించే వారికి ఉపయుక్తంగా ఉండేలా టీటీడీ ప్రారంభించిన రూ. 300 ఆన్ లైన్ ప్రత్యేక దర్శన టికెట్లను ఇకపై రాత్రి 12 గంటల వరకూ బుక్ చేసుకునే వీలు కలగనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ సాంబశివరావు వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 7 గంటల వరకే ప్రత్యేక దర్శనం కోసం టికెట్లను బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని గుర్తు చేసిన ఆయన, రాత్రి 12 వరకూ దీన్ని పొడిగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

  • Loading...

More Telugu News