: కరెంట్ షాక్... ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
విజయవాడలో దారుణం జరిగింది. ఓ రేకుల షెడ్డును నిర్మిస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు రేకులకు తగిలాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన భవానీపురం సమీపంలోని ఊర్మిళా నగర్ లో జరిగింది. వీరంతా రెక్కాడితేగాని డొక్కాడని కూలీలని తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే కుటుంబంలోని అందరూ మృతి చెందడం ఆ ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తింది. కరెంటు తీగలు ఉన్నా అజాగ్రత్తగా వ్యవహరించడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు.