: మత్తయ్య కేసులో విచారణ ప్రక్రియ రికార్డు
ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా టీ-ఏసీబీ ప్రకటించిన మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై పారదర్శక విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకుని ఆడియో, వీడియోల ద్వారా చిత్రీకరించాలని భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. విచారణ నిష్పక్షపాతంగా జరిగేందుకు ఇరు పక్షాల న్యాయవాదులు సహకరించాలని ఆయన కోరారు. రికార్డు చేసే విధానం కొత్తేమీ కాదని, సీఆర్‌పీసీ 327(1) ప్రకారం, కేసుకు సంబంధించిన న్యాయవాదులు, తెలంగాణ అడ్వొకేట్ జనరల్, సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్, కేసుకు చెందిన పార్టీలు తప్ప మరెవరూ కోర్టు హాలులో లేకుండా చూసి విచారణ జరపాలని భావిస్తున్నట్లు న్యాయమూర్తి తెలియజేశారు.