: తేనెటీగల రక్షణకు ప్రత్యేకంగా హైవే


తేనెటీగల కోసం నార్వే ప్రభుత్వం హైవే నిర్మిస్తోంది. పట్టణాల్లో పూలమొక్కలపై క్రిమిసంహారక మందులు వాడడం వల్ల తేనెటీగల ఉనికికి ప్రమాదం వాటిల్లుతోంది. దీంతో పోషక విలువలు, ఔషధ విలువలు కలిగివుండే తేనెను అందించే తేనెటీగలు అంతరించిపోయే పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పట్టణాల్లో ప్రత్యేకంగా తేనెటీగలకు ఓ హైవే నిర్మించాలని నార్వే ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల నార్వే రాజధాని ఓస్లోలో ప్రతి ఇంటి బాల్కనీపై అందమైన పూలు విరబూయనున్నాయి. వీటిపై క్రిమి సంహారక మందులు చల్లకుండా చర్యలు తీసుకోనున్నారు. అలాగే తేనెటీగల విశ్రాంతి కొసం కూడా అక్కడక్కడ ఏర్పాట్లు చేయనున్నారు. ఈ రకంగా తేనెటీగలు నార్వేలోని వీధుల్లో పూలపై వాలి వాటి ఆహారాన్ని సంపాదించుకోనున్నాయి. దీనినే 'బీ హైవే'గా పేర్కొంటున్నారు. పర్యావరణ సంస్థ సహకారంతో నార్వే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇలాంటి ప్రాజెక్టే అమెరికాలో కూడా ఉంది. దానిని 'బటర్ ఫ్లై హైవే' అంటారు. ఇది మెక్సికో నుంచి మిన్నెసోటా వరకు ఉంది.

  • Loading...

More Telugu News