: వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు...హడావుడంతా మీడియాదే!: బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలపై బీసీసీఐ స్పందించింది. ధోనీ, కోహ్లీ మధ్య విభేదాలు లేవని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ పర్యటనలో వీరిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయని, డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని బీసీసీఐ తెలిపింది. అవన్నీ ఊహాజనిత వార్తలని, విభేదాలన్నీ మీడియా వార్తల్లోనేనని బీసీసీఐ సెలెక్టర్ సందీప్ పాటిల్ వెల్లడించారు. ఎవరి కెప్టెన్సీలో అయినా పనిచేసేందుకు తనకు అభ్యంతరం లేదన్న ధోనీ వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ, బంగ్లా పర్యటనలో చోటుచేసుకున్న పలు విషయాలపై చర్చించాము కానీ, కెప్టెన్సీపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు.