: చైనాలోనూ అదే సీన్!
కొన్ని రోజుల క్రితం కేరళలోని ఓ బస్ స్టేషన్ లో పోర్న్ ఫిలిం ప్రసారం కావడం తెలిసిందే. అక్కడి టీవీల్లో సినిమా క్లిప్పింగులు, వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయాల్సిన ఆపరేటర్ పొరపాటున పోర్న్ చిత్రం ఉన్న పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడంతో బస్ స్టేషన్ లో ఉన్న టీవీల్లో అశ్లీల చిత్రం ప్రసారమైంది. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు నివ్వెరపోయారు. తాజాగా అలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. ముడాన్ జియాంగ్ నగరంలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ప్రజల కోసం భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మామూలుగా, సామాజిక చైతన్యం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కోసం ఆ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. అయితే, ఆ భారీ తెరపై పోర్న్ క్లిప్ ప్రసారం కావడంతో వాహనదారులకు, పాదచారులకు బ్రేకులు పడ్డాయి. కొందరు దూరంగా వెళ్లిపోగా, మరికొందరు ఆ పది నిమిషాల క్లిప్పింగ్ ను తమ సెల్ ఫోన్లలో బంధించేందుకు ఆసక్తి చూపించారు. ఆ స్క్రీన్ నిర్వహణ కేంద్రంలోని ఓ ఉద్యోగి నిర్వాకం మూలంగానే సదరు అశ్లీలం తెరపై కనిపించింది. ఆ ఉద్యోగి పోర్న్ చిత్రాన్ని కంప్యూటర్లో తానొక్కడే వీక్షించాలని భావించినా, అక్కడి ఆపరేటింగ్ వ్యవస్థలపై సరైన అవగాహన లేని కారణంగా అది భారీ తెరపై ప్రసారమైంది. దాంతో, బహిరంగ స్థలాల్లో అశ్లీల చిత్రాన్ని ప్రసారం చేసినందుకు ఆ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.