: తెలంగాణలో ఆరుగురు జిల్లా జడ్జిలు బదిలీ


తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. బదిలీలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సీబీఐ కోర్టు జడ్జిగా ఎం.వెంకటరమణ, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విజయ సారథి ఆచార్యులు, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాలయోగి, నాంపల్లి నాలుగో అదనపు మెట్రోపాలిటన్ జడ్జిగా సాంబశివరావునాయుడు, నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తిగా తిరుమలరావు, నిజామాబాద్ జిల్లా జడ్జిగా అరవింద్ రెడ్డిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News