: రవిశాస్త్రిని కూడా పక్కనబెట్టిన బీసీసీఐ!


మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను మాత్రమే కాదు. భారత క్రికెట్ జట్టు డైరెక్టరుగా ఉన్న రవిశాస్త్రిని సైతం బీసీసీఐ పక్కన బెట్టినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. జింబాబ్వే పర్యటనకు రవిశాస్త్రి వెళ్లడం లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఆయనకు కొన్ని వ్యక్తిగత పనులున్నందున వెళ్లడం లేదని పైకి చెబుతున్నప్పటికీ, ఇటీవల జట్టులో నెలకొన్న వివాదాలు, ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ కోహ్లీ, ధోనీలతో పాటు రవిశాస్త్రిని సైతం పక్కనబెట్టినట్టు క్రికెట్ పండితులు భావిస్తున్నారు. కాగా, వన్డేలకు ధోనీని, టెస్టులకు కోహ్లీని కెప్టెన్ లుగా చేసిన తరువాత ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తి, డ్రెస్సింగ్ రూంలో వాగ్వాదాలు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లలో అధికమంది ధోనీకి మద్దతిస్తుండగా; టీం డైరెక్టర్ రవిశాస్త్రి కోహ్లీకి మద్దతిస్తున్నారని, అందువల్లే వివాదాలు తలెత్తుతున్నాయని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారాలను గమనించిన మీదటే విశ్రాంతి పేరిట కీలక ఆటగాళ్లను, రవిశాస్త్రిని పక్కనబెట్టి, అటు యువకులు, ఇటు హర్భజన్ వంటి సీనియర్లతో కూడిన జట్టును జింబాబ్వేకు ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News