: ఆయన నరేంద్ర మోదీ కాదు... మౌనేంద్ర మోదీ: జైరాం రమేష్
భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వివాదంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రమేయంపై వార్తలు వస్తున్నప్పటికీ ప్రధాని మాత్రం స్పందించడం లేదని... ఇది చాలా దారుణమని అన్నారు. మన ప్రధాని పేరు నరేంద్ర మోదీ కాదు... మౌనేంద్ర మోదీ అంటూ సెటైర్లు విసిరారు. మోదీ మౌనముద్ర వహించినంత మాత్రాన బీజేపీ నేతలపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోవని అన్నారు. ఈరోజు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జైరాం రమేష్ పైవ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలపై కీలక ఆధారాలు ఉన్నప్పటికీ, వారిపై చర్యలు తీసుకునేందుకు మోదీ వెనకాడుతున్నారని ఆరోపించారు.