: మంత్రి నారాయణ ఆస్తులపై పిటిషన్ ఉపసంహరణ


ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆదేశాలు జారీచేయాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయవాది డీవీ రావు ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఈ రోజు చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చిన సమయంలో ఉపసంహరించుకుంటారా? లేదా కొట్టివేయాలా? అని సదరు లాయర్ ను ప్రశ్నించారు. అందుకు తాను పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు లాయర్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News