: భవిష్యత్తులో కోలుకోలేని అంతర్యుద్ధాలు రానున్నాయి: ట్విట్టర్లో పవన్ కల్యాణ్ బాంబులు
"తల్లిదండ్రులు తిట్టుకుంటు లేస్తే, పిల్లలు కొట్టుకుంటు లేస్తారని అంటారు. అలాగే బాధ్యత లేని ప్రవర్తనతో, మాటలతో పాలకులు ప్రభుత్వాలని నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయి" అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఉదయం 11 గంటల సమయంలో తన ట్విట్టర్ ఖాతాలో చేసిన కీలక వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. "పెద్దలు చెప్పినట్టు 'ఏదైనా సరే పాలకుల జ్ఞానంపై ఆధారపడి వుంటుంది' మరి మన నేతలు తమ జ్ఞానాన్ని ఉపయోగించి, మనల్ని భవిష్యత్తులోకి ఎలా నడిపిస్తారో చూడాలి" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తాను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉందనిపిస్తోందని అన్నారు. పవన్ వ్యాఖ్యలకు వందల మంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు.