: రేవంత్ రెడ్డి రిమాండ్ గడువు మరింత పెంపు


టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రిమాండ్ గడువును ఏసీబీ కోర్టు మరింత పెంచింది. ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశలో ఉన్నందున నిందితుల రిమాండ్ పొడిగించాలంటూ ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. దాంతో రేవంత్ తో పాటు సెబాస్టియన్, ఉదయసింహల రిమాండ్ ను జులై 13 వరకు పెంచుతున్నట్టు న్యాయస్థానం తెలిపింది. మరోవైపు రేపు వారి ముగ్గురి బెయిల్ పిటిషన్ లపై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరుగుతుంది. అదే సమయంలో బెయిల్ ఇచ్చేది, లేనిది కోర్టు తీర్పు వెల్లడించనుంది.

  • Loading...

More Telugu News