: డిగ్గీ రాజాపై ఎంత కోపమో... షాకిచ్చిన డీఎస్!


తనకు ఎమ్మెల్సీ టిక్కెట్ రాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అడ్డుకున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. శాసనమండలి టికెట్ రాకపోవడానికి మీరే కారణమని డీఎస్ భావిస్తూ, కోపంగా ఉన్నారని హైదరాబాదు పర్యటనలో ఉన్న డిగ్గీ రాజాకు కొందరు నేతలు చెప్పారు. దీంతో ఆయన డీఎస్ ను ఓదార్చేందుకు ఆయన ఇంటికి స్వయంగా వెళ్లాలని భావించారట. డీఎస్ తో ఫోన్లో మాట్లాడతానని, ఫోన్ కలిపి ఇవ్వాలని కూడా దిగ్విజయ్ కోరారట. పక్కన ఉన్న మరో నేత డీఎస్ కు ఫోన్ చేసి దిగ్విజయ్ మాట్లాడతారని చెప్పగా, తనకు నష్టం చేసిన ఆయనతో ఫోన్లో మాట్లాడేదేముందని నిష్టూరంగా మాట్లాడిన ఆయన, తన ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వస్తాడని ప్రశ్నించారట. ఈ పర్యవసానంతో, చేసేదేమీలేక దిగ్విజయ్ సైతం మౌనంగా ఉండిపోయారని సమాచారం.

  • Loading...

More Telugu News