: నగ్నంగా నటించడం ఇబ్బందిగానే ఉంటుంది: ష్వార్జ్ నెగ్గర్
సినిమాలలో నగ్న దృశ్యాల్లో నటించడం తమకు ఇబ్బందిగానే ఉంటుందని ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో అర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తెలిపాడు. తన తాజా చిత్రం 'టెర్మినేటర్ జెనిసిస్'లో అతను నగ్నంగా కూడా కనిపిస్తాడు. దీనిపై అర్నాల్డ్ స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేశాడు. నగ్న దృశ్యాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ... తమాషాగా ఉంటుందని చెప్పాడు. తమ సినిమాలోని ఈ సన్నివేశం సరదాగా, హాస్యభరితంగా ఉంటుందని తెలిపాడు.