: స్టీఫెన్ సన్ కోర్టును ధిక్కరించారు... ఆయనపై కేసు నమోదు చేయండి... హైకోర్టు ఆదేశం


ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరిగింది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై కోర్టు ధిక్కరణ నేరం కింద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఈరోజు ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య అరెస్టుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో... ఈ వ్యవహారంలో తమకు న్యాయం జరగడం లేదంటూ, జడ్జిని తప్పించాలని స్టీఫెన్ కొన్ని రోజుల కిందట పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో, దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీఫెన్ కోర్టును తప్పుదోవ పట్టించారని, ఇదే బెంచ్ లో కేసు విచారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సెక్షన్-15 కింద స్టీఫెన్ చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో మత్తయ్య స్క్వాష్ పిటిషన్ ను వేరే బెంచ్ కు తరలించాలన్న వ్యాజ్యాన్ని కూడా కోర్టు కొట్టివేసింది. కేసులో పారదర్శకత కోసం మత్తయ్య ఆడియో, వీడియోలను రికార్డ్ చేయాలని... ఆ సమయంలో అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇతర సీనియర్ న్యాయవాదులు మాత్రమే అక్కడ ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News