: కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్న వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రముఖ సినీ నటుడు, దివంగత నందమూరి తారకరామారావు విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. కృష్ణుడి రూపంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా పార్కులో జులై 5న వెంకయ్య ఆవిష్కరిస్తారు. వారం రోజుల అమెరికా పర్యటన కోసం మంత్రి నేడు యూఎస్ బయలుదేరి వెళుతున్నారు. జులై 1న వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అమెరికా, భారత్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వెంకయ్య పాల్గొంటారు. తరువాత అక్కడి బీజేపీ మద్దతుదారులతో జరిగే సమావేశానికి హాజరవుతారు. జులై 3న డెట్రాయిట్ లో జరిగే తానా వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదే సమయంలో తానా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకోనున్నారు. అనంతరం మిచిగాన్ గవర్నర్ స్నియడర్ తో కలసి వ్యాపార సదస్సును ప్రారంభిస్తారు. జులై 4న లాస్ ఏంజిల్స్ లో తెలుగు సంఘం నాట్స్ ముగింపు ఉత్సవాల్లో వెంకయ్య పాల్గొంటారు.