: కార్పొరేట్ కళాశాలలో విద్యార్థి సూసైడ్... కళాశాలపై విద్యార్థుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం


హైదరాబాదులోని శ్రీచైతన్య కళాశాలలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాలపై దాడి చేసి బీభత్సం సృష్టించాయి. వివరాల్లోకెళితే... నిజామాబాదు జిల్లా భిక్కనూరు మండలం జనగాంపల్లికి చెందిన ఓంప్రకాశ్ అనే విద్యార్థి గతేడాది ఇంటర్ విద్య కోసం నగర పరిధిలోని శ్రీచైతన్య కళాశాల బాచుపల్లి క్యాంపస్ లో చేరాడు. క్యాంపస్ లోని హాస్టల్ లో ఉంటున్న ప్రకాశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. సెకండియర్ కోసం ఇటీవలే కళాశాలకు వచ్చాడు. నిన్న రాత్రి తన గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం, ఆర్థికపరమైన సమస్యల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. అయితే ప్రకాశ్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు కళాశాలపై దాడి చేశాయి. ఈ దాడిలో కళాశాలలోని ఫర్నీచర్ ధ్వంసమైంది.

  • Loading...

More Telugu News