: ఒక్క రాత్రిలో తీహార్ జైలుకు కన్నమేసి తప్పించుకున్న ఖైదీలు


ఇండియాలో అత్యంత కట్టుదిట్టమైన జైలుగా పేరున్న తీహార్ కారాగారానికే కన్నమేసి తప్పించుకున్నాడో ఘనుడు. జైల్లో ఉన్న ఫైజాన్, జావేద్ అనే ఇద్దరు ఖైదీలూ గోడ కిందుగా కన్నం వేశారు. శనివారం రాత్రి వీరిద్దరూ 7వ నంబరు జైలు గోడను దూకి రాగలిగారని, 8వ నంబరు జైలు గోడకు కన్నం వేసి పారిపోయారని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఖైదీల సంఖ్య తగ్గిందని తెలుసుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టగా, వీరు తవ్విన కన్నం కనిపించిందని, ఆపై సెక్యూరిటీ టీమ్ ఫైజాన్ ను పట్టుకుందని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జైలు వర్గాలు వివరించాయి. కాగా, దాదాపు 12 వేల మందికి పైగా ఖైదీలుండే తీహార్ జైల్లో విచారణను ఎదుర్కొంటున్న, శిక్షలు అనుభవిస్తున్న పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యాధికులు ఉన్నారు.

  • Loading...

More Telugu News