: 'స్మార్ట్' యూత్ సగం సమయం వాటి కోసమే!


ఇండియాలోని స్మార్ట్ ఫోన్ వాడకందారులు నెట్లో గడుపుతున్న సమయంలో 47 శాతం వాట్స్ యాప్, వి-చాట్, స్కైప్ వంటి యాప్ ల కోసం వినియోగిస్తున్నారని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. మొబైల్ మాధ్యమంగా బ్రాడ్ బ్యాండ్ సేవల వినియోగానికి ఈ యాప్స్ కీలకంగా మారాయని స్వీడన్ టెలికాం పరికరాల తయారీసంస్థ ఇరిక్‌ సన్ తన రిపోర్టులో పేర్కొంది. ఈ యాప్స్ నిరంతరం వినియోగంలో ఉండడంతో డేటా వాడకం పెరుగుతోందని తెలిపింది. సమాచార ప్రసారంలో యాప్‌ ల ప్రభావం ఏ మేరకు ఉందోనన్న విషయం తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టు ఇరిక్ సన్ తెలిపింది. ఇండియాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికాలోని స్మార్ట్‌ ఫోన్ యూజర్లను దీనిలో భాగం చేశామని, ఇండియా 7,500 మంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను విచారించామని పేర్కొంది.

  • Loading...

More Telugu News