: హైదరాబాదుకు రండి... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ పిలుపు


దాదాపు ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న సాయంత్రం హైదరాబాదు చేరుకున్నారు. ఐదు రోజుల పాటు దాదాపుగా పాలనా వ్యవహారాలను కాస్తంత పక్కకుపెట్టి, తన ఫామ్ హౌస్ లో చేపడుతున్న అల్లం సాగుపై దృష్టి సారించిన కేసీఆర్, నిన్న మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి హైదరాబాదు బయలుదేరారు. హైదరాబాదు వచ్చీరాగానే ఆయన తన కేబినెట్ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓ సమాచారం పంపారు. తక్షణమే హైదరాబాదుకు రావాలని ఆయన ఆ సందేశంలో మంత్రులతో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కోరారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ నేడు కీలక భేటీని నిర్వహించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News