: నేటితో ముగియనున్న రేవంత్ కస్టడీ ... 10 గంటలకు కోర్టుకు తరలింపు


ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు విధించిన జ్యూడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో నేటి ఉదయం 10 గంటలకు ఆయనను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ పై హైకోర్టులో వాదోపవాదాలు పూర్తైనా, తీర్పు రేపటికి (మంగళవారానికి) వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో మరోమారు రేవంత్ రెడ్డి జ్యూడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

  • Loading...

More Telugu News