: "ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక"... కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం


పోలీసులపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశిష్ మర్జిత్ ఆగ్రహంతో ఊగిపోయారు. వారిని కుక్కలతో పోల్చారు. 'ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసు కుక్కలకు ఇదే నా హెచ్చరిక' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలోని పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పెంపుడు జంతువులుగా మారారని... తక్షణమే తీరు మార్చుకోవాలని మండిపడ్డారు. "మీ సపోర్ట్ తో వాళ్లు... వాళ్ల ఆధారంతో మీరు చేస్తున్న దారుణాలకు తెర దించండి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. ఆ సమయంలో బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధిర్ చౌదరీ కూడా వేదికపైనే ఉన్నారు. కాగా, కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను పలు పార్టీల నేతలు కూడా తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News