: కేసీఆర్ తో చేతులు కలిపిన జగన్ సీమాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు: సోమిరెడ్డి


వైకాపా అధినేత జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపిన జగన్... చివరకు సీమాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. జగన్ కు నైతిక విలువలు, రాజకీయ విలువలు లేవని అన్నారు. సీమాంధ్రులను అడుగడుగునా చెప్పలేని భాషలో అవమానిస్తున్న కేసీఆర్ తో జగన్ ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. కేసీఆర్ తో చేతులు కలపడం జగన్ కు మరణశాసనం అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీపై వైకాపా నేతలు తమ అక్కసును కక్కుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News