: గొర్రెల కాపరిని హత్య చేసి, గొర్రెలను ఎత్తుకుపోయారు
తెలుగు రాష్ట్రాల్లో దొంగలు అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, గొర్రెలను దొంగిలించేందుకు ఏకంగా గొర్రెల కాపరినే హత్య చేశారు. ఈ దారుణ ఘటన, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాలో చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన దొంగలను గొర్రెల కాపరి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో, అతడని హత్య చేసి, గొర్రెలను తీరిగ్గా ఎత్తుకు పోయారు దొంగలు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు.