: తెలంగాణను సాధించుకున్నది పెట్టుబడిదారీ విద్యావ్యవస్థను ప్రోత్సహించడానికా?: కాంగ్రెస్ నేత శ్రావణ్


ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నది... పెట్టుబడిదారీ విద్యావ్యవస్థను ప్రోత్సహించడానికా? అని టి.కాంగ్రెస్ నేత శ్రావణ్, ఎమ్మెల్యే సంపత్ ప్రశ్నించారు. 1750 మెడికల్ సీట్ల భర్తీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని సంపత్ ఆరోపించారు. విద్యా సంవత్సరం ముగియక ముందే విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో మెడికల్ కాలేజీలు డబ్బు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా 134 కాలేజీల్లో రెన్యువల్స్ ఆగిపోవడం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ పై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడుతూ వీరు పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News