: ఏపీకి నిధుల విషయంలో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే: అశోక్ గజపతిరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమే అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడినప్పటికీ, సాయం మాత్రం ఊహించనంతగా అందడం లేదని ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చలేదని చెప్పారు. మరోవైపు, హైదరాబాదులో సీమాంధ్రుల రక్షణ కోసం సెక్షన్-8ను అమలు చేయాల్సిన అవసరం ఉందని అశోక్ తెలిపారు.