: సెక్షన్-8తో పాటు అన్ని క్లాజులూ పక్కాగా అమలు కావాల్సిందే: మంత్రి నారాయణ


హైదరాబాదులో సీమాంధ్రుల రక్షణకు అత్యంత కీలకమైన సెక్షన్-8 సహా అన్ని క్లాజులు పక్కాగా అమలు కావాల్సిందే అని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సెక్షన్-8పై టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టం చేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉన్న కేసీఆర్... ఇప్పుడెందుకు అడ్డుకోవాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తాను జపాన్ పర్యటనకు వెళుతున్నామని వెల్లడించారు. తిరుపతిలో టీడీపీ సమన్వయ సమావేశం జరిగిన సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News