: కువైట్ మసీదుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు భారతీయులు మృతి
గత శుక్రవారం కువైట్ లోని ఓ మసీదుపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మృతి చెందగా 227 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారని కువైట్ లోని భారత దౌత్యాధికారి సునీల్ జైన్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రిజ్వాన్ హుస్సేన్, ఇబ్నే అబ్బాస్ లు ఉగ్ర దాడుల్లో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని సునీల్ వెల్లడించారు. షియా వర్గానికి చెందిన మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.