: టీజీవో భవన్ లో సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్-8 అమలుపై టీజీవో భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పలువురు తెలంగాణ నేతలు, మేధావులు, కళాకారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉన్నతిని అడ్డుకోవడానికే ఈ సెక్షన్ ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. దీని వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర దాగుందని తెలంగాణ ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. రిటైర్డ్ డీజీపీ హనుమంతరావు మాట్లాడుతూ, తెలంగాణలోని ఏపీ ప్రజల భద్రతను ఇక్కడి ప్రభుత్వం చూసుకుంటుందని... సీమాంధ్రలోని ప్రజల గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పారు. హైదరాబాదులో సినిమా షూటింగులకు ఎలాంటి ఆటంకాలు లేవని దర్శకుడు శంకర్ అన్నారు.