: ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలిస్తున్న సంస్థల్లో రెండు మనవే!


ప్రపంచంలో అత్యధిక మందికి ఉద్యోగాలిస్తున్న సంస్థల టాప్-10 జాబితాలో రెండు ఇండియన్ ఆర్గనైజేషన్స్ స్థానం సంపాదించాయి. భారత సైన్యం, భారత రైల్వేలు అత్యధికులకు ఉపాధిని కల్పిస్తున్న సంస్థలుగా నిలిచాయని 'వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్' పేరిట విడుదలైన నివేదిక వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ, రైల్వేస్ లు 27 లక్షల మందికి ఉపాధిని కల్పించాయని తెలిపింది. ఇండియన్ రైల్వేస్ 14 లక్షల మందితో 8వ స్థానంలో, 13 లక్షల మందికి ఉపాధిని కల్పించిన ఆర్మీ 9వ స్థానంలో నిలిచాయని నివేదిక వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన రిపోర్టు ప్రకారం, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ అత్యధికంగా 32 లక్షల మందికి ఉపాధిని కల్పించి జాబితాలో మొదటి స్థానంలో నిలువగా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (చైనా) 23 లక్షల మందికి ఉద్యోగాలిచ్చి రెండో స్థానంలో నిలిచింది. ఆపై వాల్ మార్ట్ (21 లక్షలు), మెక్ డొనాల్డ్స్ (19 లక్షలు), బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (17 లక్షలు), చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (16 లక్షలు), చైనాకే చెందిన స్టేట్ గ్రిడ్ కార్పొరేషన్ (15 లక్షలు)లు టాప్-7 స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News