: మద్యం మత్తులో కడప ఎస్పీ కుటుంబాన్ని వేధించిన మందుబాబులు
కొందరు యువకులు మందుకొట్టారు. ఆ మత్తులో కడప ఎస్పీ కుటుంబాన్ని వేధించారు. అడ్డంగా బుక్కయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పరిధిలోని హార్స్ లీ హిల్స్ లో నిన్న అర్ధరాత్రి జరిగింది. విహారం నిమిత్తం ఇక్కడికి వచ్చిన ఎస్పీ కుటుంబం, స్థానిక గవర్నర్ అతిథి గృహంలో బస చేసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు గది తలుపులు కొట్టి ఇబ్బంది పెట్టారు. మత్తులో హల్ చల్ చేశారు. ఎస్పీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.