: అక్కడ కాలు పెట్టగానే రింగ్ టోన్ మారిపోద్ది!
మరో రెండు వారాల్లో రానున్న గోదావరి పుష్కరాలను నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న ఏపీ సర్కారు, అందుకు టెక్నాలజీని సైతం వాడుకుంటోంది. పుష్కర అనుభూతిని మరింతగా పెంచేలా, ఉభయ గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టగానే ప్రతి స్మార్ట్ ఫోన్ రింగ్ టోన్ మారిపోయేలా చేయనుంది. ‘మహాపుష్కరం’ అనే చరణంతో ప్రారంభమయ్యే పాట ఆటోమేటిక్ గా రింగ్ టోన్ అయిపోతుంది. పుష్కరాల నిర్వహణలో వైవిధ్యం కోసం చంద్రబాబు సర్కారు ఈ ఆలోచన చేసింది. పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉండే ప్రతి స్మార్ట్ ఫోన్ లో ‘మహాపుష్కరం’ రింగ్ టోన్ మాత్రమే ఉంచాలన్న ఉద్దేశంతో ఈ మేరకు సాంకేతికతను ఉపయోగించుకోనుంది.