: లలిత్ మోదీ బాధితుడే, నేరస్తుడు కాదు: మద్దతు పలికిన ఎన్సీపీ
పలు ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. ఆయన బాధితుడే కానీ, నేరస్తుడు కాదని పార్టీ సీనియర్ నేత మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు. "ఇప్పటివరకూ ఆయన ఏ చిన్న కేసులో కూడా నేరస్తుడిగా నిర్ణయించబడలేదు. అందువల్ల ఆయన్ను పారిపోయిన వాడిగా, దివాలాదారుగా వ్యాఖ్యానించడం తగదు" అని ఆయన అన్నారు. ఆయన ఇబ్బందుల్లో పడ్డ తరువాత తనకు పరిచయం ఉన్న ప్రముఖులందరినీ సహాయం కోరాడని, కొందరు చేశారని ఆయన అన్నారు. ఇంతవరకూ తప్పేమీ లేదని, వసుంధరా రాజే, తాను సిఫార్సు చేస్తూ ఇచ్చిన పత్రాలను రహస్యంగా ఉంచాలని కోరడం మాత్రం తప్పేనని అభిప్రాయపడ్డారు.