: యాక్సిడెంట్ చేసిన హర్షకుమార్ తనయుడు సుందర్


మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షకుమార్ తనయుడు సుందర్ అజాగ్రత్తగా కారు నడిపి ఓ టూ వీలర్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కోలమూరులో శనివారం అర్ధరాత్రి జరిగింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ముందు వెళుతున్న వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన సుందర్ కారు ఢీ కొట్టింది. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News