: 'కోడ్' బ్రేక్... మద్యం లైసెన్సుల జారీ వాయిదా
మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, కోడ్ అమలులో ఉండగా, మద్యం దుకాణాలకు లైసెన్సులను ఎలా మంజూరు చేస్తారని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ప్రశ్నించడంతో కర్నూలు జిల్లాలో లైసెన్సుల జారీ వాయిదా పడింది. జిల్లా వ్యాప్తంగా 175 దుకాణాలకు గాను లైసెన్సులిచ్చేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా, భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మండలి ఎన్నికల్లో ఇండిపెండెంటుగా బరిలో ఉన్న శేషు యాదవ్ ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో, లైసెన్సుల జారీ ప్రక్రియను నిలిపివేయాలని కలెక్టరుకు ఆదేశాలు అందాయి. ఎన్నికల అనంతరం దరఖాస్తు నోటిఫికేషన్ వెలువరిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఎన్నికల కోడ్ జులై 7వ తేదీ సాయంత్రం వరకు అమల్లో ఉంటుంది.