: ఈశాన్యాన భూకంపం... వీధుల్లోకి పరుగు తీసిన ప్రజలు
ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. కోక్రాఝార్ కేంద్రంగా భూమి కంపించినట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఈ ప్రకంపనల ప్రభావం అసోం, త్రిపుర, మణిపూర్ తదితర రాష్ట్రాలపై పడింది. పలు ప్రాంతాల్లో ఆరు నుంచి 30 సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగు తీశారు. కొన్ని భవనాల గోడలు బీటలు వారినట్టు తెలిసింది. భూకంపం తరువాత ప్రాణ నష్టం ఏమీ జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.