: ఏపీలో అత్యధిక డిమాండున్న మద్యం షాపు ఇదే!
నడికుడి... గుంటూరు జిల్లాలో గురజాల, పిడుగురాళ్ల మధ్య ఉండే ఊరు. గుంటూరు నుంచి మాచర్ల, సికింద్రాబాదు వెళ్లే రైలు మార్గాలకు జంక్షన్. అద్దంకి, నార్కట్ పల్లి హైవేపై ఉంటుంది. ఈ ఊరికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక డిమాండున్న మద్యం షాపు ఇక్కడే ఉంది. నిబంధనల ప్రకారం ఈ ఊర్లో ఒక్క షాపుకే అనుమతులు ఉన్నాయి. ఈ షాపు కోసం ఎంతో మంది బడా వ్యాపారులు పోటీ పడతారు. గతంలో బిడ్ల ద్వారా దుకాణాలు కేటాయించినప్పుడు ఏకంగా రూ. 5 కోట్లకు పైగానే పలికి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ఈ దఫా 300 మందికి పైగా వ్యాపారులు ఈ కేంద్రంలో షాపు కోసం దరఖాస్తులు దాఖలు చేశారు. వీరిలో షాపును దక్కించుకునే అదృష్టవంతుడు ఎవరో?