: ఐపీఎల్ లో రైనా, జడేజా, బ్రావో ఫిక్సింగ్ కు పాల్పడ్డారు: లలిత్ మోదీ


ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ అన్నంత పనీ చేస్తున్నారు. రోజుకో సంచలనం బయటపెడతానని ప్రకటించి, అన్నట్టుగానే చేస్తున్నారు. తొలి రోజు సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలపై వ్యాఖ్యలు చేసిన లలిత్, పెను వివాదమే రేపారు. రెండు రోజుల తరువాత ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలను లండన్ లో కలిశానంటూ బాంబు పేల్చారు. తాజాగా సురేష్ రైనా, రవీంద్ర జడేజా, డ్వెన్ బ్రావో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ సంచలనం రేపారు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న ఈ ముగ్గురు ఆటగాళ్లకు బాబాదీవాన్ అనే బుకీ భారీ మొత్తం ఇచ్చాడని, పలు చోట్ల ప్లాట్లు కూడా ఇచ్చాడని అన్నారు. వీరి ఫిక్సింగ్ పై ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్ కు 2013లో తాను రాసిన 13 పేజీల లేఖను బహిర్గతం చేశారు. కాగా, 2013లో ఐపీఎల్ ఫైనల్లో ముంబై చేతిలో చెన్నై మట్టికరిచింది.

  • Loading...

More Telugu News