: ట్యునీషియా నుంచి తరలుతున్న బ్రిటిషర్లు
ట్యునీషియాలోని రెండు బీచ్ లలోని హోటళ్లలో బ్రిటన్ టూరిస్టులపై ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అత్యంత పాశవికంగా దాడులకు పాల్పడడంతో, బ్రిటన్ టూరిస్టులను ఆపరేటర్లు స్వదేశానికి తరలిస్తున్నారు. కేవలం బ్రిటన్ దేశస్థులను లక్ష్యం చేసుకుని ఐఎస్ఐఎస్ దాడులకు పాల్పడడంతో ఆ దేశం ఉలిక్కిపడింది. దీనిపై బ్రిటన్ రక్షణ శాఖ కార్యదర్శి మిచెల్ ఫాలెన్ మాట్లాడుతూ, తమ దేశీయులను స్వదేశం చేర్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అక్కడున్న వేలాది మంది బ్రిటన్ పర్యాటకులను ప్రత్యేక విమానంలో స్వదేశానికి రప్పిస్తున్నట్టు చెప్పారు.