: ట్విట్టర్ కు గుడ్ బై చెప్పిన భారత సంతతి అధికారి


ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ కు భారత సంతతి వ్యక్తి రిషి గార్గ్ రాజీనామా చేశారు. రిషి ట్విట్టర్లో కార్పొరేట్ డెవలప్ మెంట్-స్ట్రాటజీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ఇటీవలే ట్విట్టర్ సీఈఓ పదవికి డిక్ కాస్టొలో రాజీనామా చేయగా, తాజాగా రిషి తప్పుకోవడం చర్చనీయాంశం అయింది. తన కోసం కొత్త ప్రాజెక్టులు వేచి చూస్తున్నాయని రిషి ట్వీట్ చేశారు. కాగా, రిషి స్థానంలో ఎవరిని నియమిస్తారనేది ఇంకా వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News