: అక్కినేనికి అవార్డును అంకితమిచ్చిన అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ తన ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు అంకితమిచ్చాడు. ఈ విషయాన్ని బన్నీ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. "నన్ను ఎంతగానో సపోర్ట్ చేసినందుకు 'రేసుగుర్రం'లోని నటీనటులకు, యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డికి కృతజ్ఞతలు. నా ఈ అవార్డును లెజండరీ ఏఎన్ఆర్ గారికి డెడికేట్ చేస్తున్నా" అని ట్వీట్ చేశాడు. 'రేసుగుర్రం' చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు దక్కింది. చెన్నైలో నిన్న (శుక్రవారం) సాయంత్రం జరిగిన 62వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాల కార్యక్రమంలో అర్జున్ అవార్డును అందుకున్నాడు.