: ఆ సినిమాను ఆపడానికి ప్రయత్నిస్తున్న కంగనా రనౌత్
పేరు ప్రతిష్ఠలు వచ్చాక వాటికి భంగం కలిగితే సహించడం కాస్త కష్టమే. అలాంటి కష్టమే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కు వచ్చింది. 'క్వీన్', 'తను వెడ్స్ మను' సినిమాలు సూపర్ హిట్ కావడంతో తరువాతి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ దశలో కంగనా రనౌత్ 2011లో సన్నీడియోల్ సరసన నటించిన 'ఐ లవ్ న్యూ ఇయర్' సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అయితే తన ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావించిన కంగనా రనౌత్, దానిని ఆపేందుకు టీ సిరీస్ కు లీగల్ నోటీసులు పంపింది. దీంతో, తాము ఆ సినిమా ఎప్పుడో అమ్మేశామని, సినీ నిర్మాణం సమయంలోనే కంగనాకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ చెల్లించేశామని స్పష్టం చేసింది. కాగా, రష్యన్ సినిమా 'ఐరనీ ఆఫ్ ఫేట్' ఆధారంగా ఈ 'ఐ లవ్ న్యూ ఇయర్' పేరుతో రూపొందించింది. 2011లోనే ఈ సినిమా పూర్తైనప్పటికీ, ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాను 'లక్కీ', 'నో టైమ్ టు లవ్' వంటి ఫ్లాప్ సినిమాలు రూపొందించిన రాధికా రావు, వినయ్ ష్రాఫ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.