: గోదావరి పుష్కరాలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు


జులైలో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. పలు చోట్ల నుంచి పుష్కరాలు జరిగే ప్రాంతాల మీదుగా మొత్తం 58 రైళ్లు వెళ్లనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాకినాడ-హైదరాబాద్ మధ్య అత్యధికంగా 16 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్-శ్రీకాకుళం మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాకినాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కాకినాడ, విశాఖ-హైదరాబాద్, హైదరాబాద్- శ్రీకాకుళం, శ్రీకాకుళం-హైదరాబాద్ లకు ఈ రైళ్లు నడుస్తాయి. పుష్కరాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనా నేపథ్యంలోనే ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

  • Loading...

More Telugu News