: కొచ్చిలో 'బాహుబలి' బృందానికి చండీ వాయిద్యాలతో అపూర్వ స్వాగతం


భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన జానపద చిత్రం 'బాహుబలి' పలు భాషల్లో విడుదల కానుంది. బాహుబలి మలయాళ వెర్షన్ కు సంబంధించి శనివారం పాటలు విడుదల చేస్తున్నారు. అందుకోసం 'బాహుబలి' బృందం కొచ్చి వెళ్లింది. అక్కడ బాహుబలి యూనిట్ కు మేళతాళాలతో ఘనమైన స్వాగతం లభించింది. అపూర్వరీతిలో కేరళ స్పెషల్ చండీ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, నటుడు రానా, హీరోయిన్లు అనుష్క, తమన్నా పాల్గొన్నారు. కాగా, తమకు లభించిన ఘనస్వాగతం పట్ల బాహుబలి యూనిట్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది.

  • Loading...

More Telugu News