: అమెరికా అంతటా స్వలింగ వివాహాలకు గ్రీన్ సిగ్నల్!


అమెరికాలో ఇప్పుడు ఎక్కడైనా స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు మార్గం సుగమమైంది. దేశంలో ఎక్కడైనా స్వలింగ జంటలు పెళ్లి చేసుకునే హక్కు ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వలింగ వివాహలకు చట్టబద్ధత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో స్వలింగ జంటలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం యూఎస్ లో గే, లెస్బియన్ జంటలు పెళ్లి చేసుకోడానికి 36 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాల్లో మాత్రమే అనుమతి ఉంది. తాజాగా న్యాయస్థానం తీర్పుతో అమెరికాలోని మిగతా 14 రాష్ట్రాల్లో కూడా గే, లెస్బియన్ పెళ్లిళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రెండు సంవత్సరాల కిందట స్వలింగ వివాహ వ్యతిరేక చట్టంలోని కొంతభాగాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. అయితే కాలిఫోర్నియా వర్సిటీ విలియమ్స్ ఇనిస్టిట్యూట్ ప్రకారం అమెరికాలో 3,90,000 స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలు ఉన్నాయి. మరో 70 వేల జంటలు ఈ వివాహాలకు అనుమతిలేని రాష్ట్ర్రాల్లో ఉన్నాయి. అటు కోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు చిహ్నంగా అధ్యక్షుడి భవనం వైట్ హౌస్ ను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

  • Loading...

More Telugu News