: ఎర్రబెల్లి ఇంటి ముందు ఎమ్మార్పీఎస్ డప్పు...టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్
టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఇంటి ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) డప్పు మోత మోగించింది. తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాదులో సెక్షన్ 8ను అమలు చేయాలన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి వాదనకు ఎర్రబెల్లి మద్దతు పలకడంపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన రాజకీయ నేతగా తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తారని ఎర్రబెల్లిని ప్రశ్నించారు. తక్షణమే టీడీపీకి రాజీనామా చేసి బయటకు రావాలని ఎర్రబెల్లిని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి ఇంటి ముందు డప్పుల మోతతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేశారు.