: అమృత్, స్మార్ట్ సిటీల ఎంపికలో తెలుగు రాష్ట్రాలపై వివక్ష లేదు: వెంకయ్య


అమృత్, స్మార్ట్ సిటీల ఎంపికలో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలపై ఎలాంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. జనాభా ప్రాతిపదికనే ఎంపిక చేశామని చెప్పారు. స్మార్ట్ సిటీలు, అమృత్, పేదల గృహ నిర్మాణం పథకాలపై కేంద్ర విధానాలు వెల్లడించామని, ఇక రాష్ట్రాలు తమ బాధ్యతను పోషించాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థలకు సరైన అధికారాలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను కోరుతున్నామన్నారు. తెలంగాణకు 2 స్మార్ట్ నగరాలు, 15 అమృత్ నగరాలు; ఆంధ్రప్రదేశ్ కు 3 స్మార్ట్ నగరాలు, 31 అమృత్ నగరాలు ఇటీవల కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News