: రూ.100 కోట్ల విలువైన పాము విషం పట్టివేత... స్కూలు బ్యాగుల్లో అక్రమరవాణా
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన పాము విషాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బైకుంఠపూర్ ఫారెస్ట్ డివిజన్ లో బెలకోబా వద్ద ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసిన అటవీ శాఖ అధికారులు వారి నుంచి పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు మోటార్ సైకిళ్లపై వారు పాము విషాన్ని అక్రమ రవాణా చేస్తుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఆ విషాన్ని భూటాన్ కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. స్కూల్ బ్యాగుల్లో ఈ విషంతో నింపిన బాక్సులను ఉంచి అక్రమ రవాణాకు పాల్పడ్డారు.